కార్టూన్ తో శ్రీదేవికి అద్బుత నివాళి

updated: February 25, 2018 22:26 IST
కార్టూన్ తో శ్రీదేవికి అద్బుత నివాళి

శ్రీదేవి అకాల మృతి అందరినీ శోకసంద్రంలో ముంచేస్తున్న సంగతి తెలిసిందే. అమె మృతి పట్ల ప్రాంతాలకు అతీతంగా సానుభూతి వ్యక్తమవుతోంది. ఆమెతో కలిసి పనిచేసిన దర్శకులు, సహనటులు శ్రీదేవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

నిన్నగాక మొన్న ‘మామ్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీదేవి హఠాత్తుగా మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఆమె అభిమానుల్లో కళాకారులు, కార్టూనిస్ట్ లు, సినమా వాళ్లు, రాజకీయనాయుకులు ఇలా ఎందరో..ఎందరెందరో. వారంతా తమదైన శైలిలో ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.    ప్రముఖ కార్టూనిస్ట్ లేపాక్షి  గారు కూడా  ఓ కార్టూన్ తో ఆమెపై తనకున్న  అభిమానాన్ని చాటి చెప్పారు. ఆ కార్టూన్ ..ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్షేషన్ అయ్యింది.  ముఖ్యంగా అతిలోక సుందరి అందాన్ని అద్బుతంగా కార్టూనికరించారు. ఆ కార్టూన్ ని మీరు ఇక్కడ చూడవచ్చు


Tags: lepakshi, cartoonist lepakshi

comments