కాప్షన్ లెస్ కార్టూన్స్ పోటీ విజేతల ప్రకటన

updated: March 6, 2018 13:26 IST

ప్రముఖ కార్టూనిస్ట్ , సాప్ట్ వేర్   నిపుణులు అయిన బన్ను గారు ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన క్లీన్ తెలుగు మ్యాగజైన్   గో తెలుగు.కామ్. అలాగే మరియు మరో ప్రముఖ కార్టూనిస్ట్ రాము గారు గత 15 సంవత్సరాలుగా తెలుగులో నిర్వహిస్తున్న ఒకే ఒక్క హాస్య తెలుగు పత్రిక హాస్యానందం. ఈ రెండు పత్రికలు   సంయుక్తంగా నిర్వహించిన కాప్షన్ లెస్ కార్టూన్ల పోటీ ఫలితాలు వెలుబడ్డాయి. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ బాబు అలియాస్ జయదేవ్ ఈ పోటీకు న్యాయనిర్ణేతగా వ్యవహించారు. ఈ పోటీలో  మొదటి బహుమతి కళాధర్ బాపు, రెండవ బహుమతి మూవి  , మూడవ బహుబతి బి.ధనుష్  ఎంపిక చేయబడ్డారు. ఆ కార్టూన్ లు ఇక్కడ చూద్దాం.

ఈ సందర్బంగా డా. యస్. జయదేవ్ బాబు మాట్లాడుతూ... వ్యాఖ్య రహిత కార్టూన్లు లేదా సైలెంట్ కార్టూన్లు చూస్తే కనుబొమలెగరేయాలీ లేదా కనుబొమ్మల్ని ముడివేయాలి. నాకు రెండో తెగ కార్టూన్లంటే ఇష్టం. సైలెంట్ కార్టూన్లో, కార్టూనిస్ట్ ఏదో ఒక కొత్త సందేశాన్ని చొప్పించి ఆలోచింప చేస్తాడు. కార్టూన్లు పరిశీలనగా, పదే పదే చూడాలనిపిస్తోంది. నేడు మానవాళిని వేధిస్తున్న వివిధ అంశాల మీద సైలెంట్ కార్టూనిస్ట్ లు స్పందిస్తున్నారు. 

ఇక పోటీకి వచ్చిన కార్టూన్ల విషయానికి వస్తే..అనేక ఎంట్రీలు సెల్ ఫోన్ మత్తు మీద ఉన్నాయి. ఎక్కువ శాతం బహుమతులు ఈ కార్టూన్లే గెలుచుకున్నాయి. ఇతర సబ్జెక్టులు, వన ప్రాణి సంరక్షణ, డబ్బుల్లేని బ్యాంకులు, నీళ్లు లేని మరుగుదొడ్లు, విఐపీ వ్యామోహాలు, సందేశ పూరితంగా ఉన్నాయి అన్నారు.

comments